| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గొంతులో ప్రాణమున్నంత వరకు ప్రజాసేవ చేస్తా : ఎంపి రంజిత్ రెడ్డి

గొంతులో ప్రాణమున్నంత వరకు ప్రజాసేవ చేస్తా : ఎంపి రంజిత్ రెడ్డి

కాంగ్రెస్ బూత్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చేవేళ్ళ ప్రాంత అభివృద్ధియే తన జెండా.. ఎజెండా అని స్థానిక ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన గొంతులో ప్రాణమున్నంత వరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో స్థానిక ఇంఛార్జీ కేఎల్ఆర్ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ బూత్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…. కొత్త, పాత కలయికతో కార్యకర్తలందరూ కలసికట్టుతో పని చేయాలని సూచించారు. చేయి చేయి కలిపి ఈ చేవేళ్ళ గడ్డ  మీద కాంగ్రెస్  విజయకేతనం ఎగురవేద్దామన్నారు. తన ప్రాంత ప్రజలకు మరింత సేవ చేసేందుకు పార్టీ మారితే దాన్ని పలువురు రాజకీయ అవకాశం అనడం సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అంది వచ్చిన అవకాశాలను తీసుకొని ప్రజలకు సేవ చేయడమే ఏ రాజకీయ నేతకైనా ప్రధాన కర్తవ్యమని ఆయన వివరించారు. తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా… తాను పట్టించుకోనని… ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్ల నర్సింహ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, బడoగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత, మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, ఎంపీపీ సునీతా అద్యనాయక్, మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకి ఈశ్వర్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.

Previous రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారు : కేటీఆర్
Next తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత
ADVERTISEMENT