డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌ను గురువారం హైదరాబాద్ హజ్ భవన్‌లో కలిశారు.
రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఒబెదుల్లా కొత్వాల్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మహ్మద్ బాబర్ అలీఖాన్, అమ్‌జద్ గోరీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఇబ్రహీం మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల పక్షపాతి అని అన్నారు. మైనారిటీల అభివృద్ధికి కొత్వాల్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.