| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కారు, వాటర్ ట్యాంకర్ ఢీకొని 3 సంవత్సరాల చిన్నారి మృతి

కారు, వాటర్ ట్యాంకర్ ఢీకొని 3 సంవత్సరాల చిన్నారి మృతి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:వాటర్ ట్యాంకర్ కారును ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఈరోజు చోటు చేసుకుంది.

కారును వాటర్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులంతా పాతబస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదానికి సంబం ధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Previous అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Next ఆసుపత్రిలో చేరిన తమిళ్ హీరో అజిత్ కుమార్
ADVERTISEMENT