| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం నిజామాబాద్ కు చెందిన యువతి భక్తితో విరాళం అందజేసింది.

నిజామాబాద్ కు చెందిన భక్తురాలు జక్కుల రుచిత తనకు ఉద్యోగం రావడంతో, తన మొదటి జీతం నుంచి రూ. 26,730 నగదును స్వామివారి సేవ కోసం ఆలయ అధికారులకు అందజేశారు.

ఆలయ ప్రోటోకాల్ కార్యాలయంలో తల్లిదండ్రులు జె. రవీందర్, మీనా లతో కలిసి ఏఈవో లక్ష్మణరావు, పీఆర్వో పెరిక శ్రీనివాస్ లకు విరాళాన్ని అందించారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.

మొదటి జీతాన్ని దేవుడికి సమర్పించిన రుచిత భక్తి భావం పలువురిని ఆకట్టుకుంటోంది.

Previous దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Next నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
ADVERTISEMENT