డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్త తెలిపారు. శుక్రవారం భీమారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య విబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచిస్పందన వచ్చి నట్లు ఆయన వివరించారు.దీంతో పాటు గ్రామంలోని ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్, ఈసీజీ, సబంధిత పరీక్షలు, లెన్స్ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు.. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, వార్డు సభ్యులు వీరేశం, ప్రశాంత్ గౌడ్, రమాదేవి చెన్నయ్య,అరుణ కుమారి యాదయ్య, మల్లయ్య, నర్సింలు, శోభన్ బాబు, శ్రీనివాస్,బుచయ్య తదితరులు పాల్గొన్నారు.
News
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త