డైలీ భారత్, కోనరావుపేట: కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నేతుల రాజయ్య (70) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరు నెలల క్రితం ఆయన భార్య మృతి చెందడంతో అప్పటి నుంచి రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని రాజయ్య మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.