కుటుంబ వివాదం పరిష్కారానికి లంచం డిమాండ్.. కటకటాల్లోకి సబ్ ఇన్‌స్పెక్టర్.
డైలీ భారత్, హైదరాబాద్:బాధితుడి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ఆర్. పాండు నాయక్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం ఫిర్యాదుదారుడిపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కేసు నమోదు చేయకుండా ఉండటానికి, కుటుంబ సభ్యుల మధ్య వివాదాన్ని సయోధ్యతో పరిష్కరించడానికి మరియు ఫిర్యాదుదారుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయకుండా ఉండటానికి ఎస్ఐ పాండు నాయక్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు.
బాధితుడి నుంచి ఎస్ఐ డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 బృందం అదుపులోకి తీసుకుని, ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎస్ఐ పాండు నాయక్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.