అశోక ఛైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవలో వైద్యులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజం గర్వించేలా చిన్నారులను తీర్చిదిద్దేందుకే అశోక ఛైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని వైద్యులు వెల్లడించారు. చిన్నారుల మానసిక స్థితిని ప్రారంభ దశలోనే గుర్తించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఈ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని డాక్టర్ రాహుల్ గుల్వే. డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే, డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే,లు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డి ఎస్ చౌరస్తాలో గల రిలయన్స్ బజార్ మూడవ ఫ్లోర్లో అశోక ఛైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ని రూరల్ ఎస్ ఐ షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అశోక రెహాబ్ గ్రూప్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 22వ బ్రాంచ్ ని ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. చిన్నారుల ఎదుగుదలకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లా వాసులు దీన్ని సద్వినియోపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్యులకు అభినందనలు తెలిపారు.పిల్లల ప్రత్యేక ఎదుగుదల, థెరపీ రంగంలో హైదరాబాద్లోనే అత్యంత ఆదరణ పొందిన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తమ సేవలను నిజామాబాద్ నగరానికి విస్తరిస్తోందన్నారు. ప్రతి బిడ్డకూ ఉత్తమమైన ఆరంభం లభించాలి అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక కేంద్రం విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు.అశోక ఛైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వైద్యులు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని,పిల్లల్లో ఉండే ఫాఫ్ 1 రకాల ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారిని సమాజంలో స్వతంత్రులుగా మార్చడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ సందర్బంగా ఈ కేంద్రంలో లభించే ప్రత్యేక సేవలను వివరించారు.
ఎర్లీ ఇంటర్వెన్షన్: పిల్లల సమస్యలను చిన్న వయసులోనే గుర్తించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.
అడ్వాన్స్ డ్ థెరపీలు: స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ప్రత్యేక శిక్షణ.ఇస్తామన్నారు.
ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్: అనుభవజ్ఞులైన క్లినికల్ సైకాలజిస్ట్లు, స్పీచ్ పాథాలజిస్ట్ల పర్యవేక్షణ.చేస్తారన్నారు.
చైల్డ్ సెంట్రిక్ కేర్: ప్రతి బిడ్డ అవసరానికి తగ్గట్టుగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు.
నిజామాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో అశోక రెహాబ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ నవితా రాహుల్ గుల్వే, డాక్టర్ శ్వేతా కిరణ్ కుమార్ గుల్వే, జైశీల సచిన్ గుల్వే, మేనేజ్మెంట్ ప్రీతి, సుష్మ రంజిత్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.