| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

లాకవత్ గిరి బాబు నాయకులు

డైలీ భారత్, వైరా: రాఖీ పౌర్ణమి సందర్భంగా వైరా నియోజకవర్గ సోదరసోదరీమణులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలనే ప్రేమ, బాధ్యతలకు ప్రతీక అని అన్నారు. కుటుంబ బంధాలు మరింత బలపడాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆత్మీయత, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలని కోరారు.

వైరా నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పౌర్ణమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని లకావత్ గిరిబాబు ఆకాంక్షించారు.

Previous మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి
Next రాఖీ పండుగ
ADVERTISEMENT