| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

ఒడిశా నుండి తమిళనాడుకు  గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు...

ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందుతులు అరెస్టు..

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ సారంగపాణి...

డైలీ భారత్, ఖమ్మం: శుక్రవారం వైరా ఎస్‌ఐ రామారావు తన సిబ్బందితో కలిసి వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామం వద్ద అంజనేయస్వామి దేవాలయం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించేందుకు వెళ్తుండగా, రోడ్డుపక్కన ఐదు గోనె సంచులతో అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు.

వారిని తనిఖీ చేయగా, ఐదు గోనె సంచులలో మొత్తం 60 ప్యాకెట్లలో సుమారు 64 లక్షల రూపాయల విలువ చేసే 128 కిలోల ఎండు గంజాయిని ఒరిస్సా లోని మల్కనగిరి ప్రాంతం నుండి తమిళనాడు కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. 

అరెస్టు చేసిన నిందితులు:

మనుయాల్ బోత్రా (22 సం॥లు), రాబా కాలనీ, దొరగూడ పంచాయతీ, చిత్రకొండ బ్లాక్, మల్కాంగిరి జిల్లా, ఒడిశా.

చిటికల సన్యాసినాయుడు (25 సం॥లు), నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

లక్ష్మణ్ కిలో (24 సం॥లు), కమర్గూడ, బోడపొద్దూర్, చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధి, మల్కాంగిరి జిల్లా, ఒడిశా.

పోలీసుల హెచ్చరిక: సమాజాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా, వినియోగం వంటి అక్రమ కార్యకలాపాలపై ఖమ్మం కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు.

“డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి” అని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Previous ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Next "ఆలోచనల బంధనం, ప్రవర్తనల పునరావృతం" అదే ..OCD
ADVERTISEMENT