| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుమల పర్యావరణ పరిరక్షణకు టిటిడి పెద్దపీట

తిరుమల పర్యావరణ పరిరక్షణకు టిటిడి పెద్దపీట

పాత వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు

అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి

డైలీ భారత్ న్యూస్, తిరుమల డెస్క్ : తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పాత డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు వినియోగంలోకి తీసుకురావడానికి టిటిడి విస్తృత చర్యలు చేపట్టినట్లు టిటిడి అదనపు ఈవో  సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ (ఢిల్లీ) సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధులు, ఆర్టీసీ, టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలను సంపూర్ణ కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. మొదటిగా తిరుపతి–తిరుమల మధ్య పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, తిరుమలలో నడిచే ట్యాక్సీలు మరియు ఇతర అద్దె వాహనాలను విద్యుత్ వాహనాలతో దశలవారీగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధి కునాల్ జోషి వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో జరగనున్న టిటిడి బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.సమావేశంలో టిటిడి డీఎఫ్‌వో ఫణికుమార్ నాయుడు, విజివో సురేంద్ర, ఐటి డిప్యూటీ జనరల్ మేనేజర్  వెంకటేశ్వర్లునాయుడు, రాష్ట్ర రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Previous దీక్షాదివస్ కు ముస్తాబైన నిజామాబాద్ బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయం
Next ఆ హక్కు మీకు లేదంటూ... ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్
ADVERTISEMENT