| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : ఓటరు మేలుకో

శీర్షిక : ఓటరు మేలుకో

డైలీ భారత్ స్పెషల్, శీర్షిక:

శీర్షిక : ఓటరు మేలుకో 

వస్తున్నాయి పంచాయతీ ఎన్నికలు 

వస్తున్నారు నవాబులు

నాయకుల మాటలు అందని

ద్రాక్షా గుత్తులు అని గుర్తుంచుకో

సాన పెట్టు నీ ధిమాకు

ముందు నుయ్యి  వెనుక గొయ్యి

కండ్లు తెరచి ఓటు వేయ్యి

మద్యానికి బానిసై భవిష్యత్

మరిచిపోకు

డబ్బుకు ఓటు హక్కును దాసోహం

చేయకు

నాయకుల మాయ మాటలు విని

ఆగమాగం కాకు అరిగోస  పడకు

దారి తప్పి బురద లో కూరకు

ఎన్నికల ముందు దండాలు పెడతారు

ఎన్నికల తరువాత మంట పెడతారు

ఇది కవిత కాదు కలత

ముందు తరాల బవిత

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ 

రచన మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Previous ప్రేమ విఫలమై సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Next సామాజిక న్యాయ దిక్సూచి,సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే : మోతె రాజిరెడ్డి టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు
ADVERTISEMENT