డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:విశ్వహిందూ మహాసంగ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు జైపూర్ రాష్ట్రీయ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా అధికారిక ఆహ్వానం లభించింది.డిసెంబర్ 3, 4, 5, 6 తేదీలలో జరగనున్న విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాలని, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఠాగూర్ , జాతీయ కన్వీనర్ మహంతి ముఖేష్ చరవాణి ద్వారా తెలియజేశారు.
విశ్వహిందూ మహాసంగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాసభలకు మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం హాజరుకానున్నారు.మద్దిశెట్టి సామేలు ఈ ఆహ్వానం, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచన మేరకు అందినదని తెలియజేశారు.