డైలీ భారత్, సీలేరు : సీలేరు కాంప్లెక్సు పరిధిలో బలిమెల జలాశయం దిగువన ఏపీ పవర్ హౌస్ నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి జలాశయమైన బలిమెల నుంచి ఆంధ్రా వాటాగా టన్నెల్ గేట్ల నుంచి సీలేరు గుంటవాడ జలాశయానికి నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రదేశంలోనే 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను 1980 సంవత్సరంలోనే ఉమ్మడిగా నిర్మించడానికి అప్పట్లో ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందులో అత్యధిక వాటా ఆంధ్రాకు దక్కేలా ఒప్పందం కుదిరింది.
News
మరోసారి తెరపైకి ఏపీ పవర్ హౌస్