నిరుపేదల హక్కుల సాధన సమితి ఆగ్రహం
డైలీ భారత్, మెదక్/ సిద్దిపేట:రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు ప్రజల యొక్క రోజువారి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈరోజు అనేక రంగాల్లోని కార్మికులు టీచర్లు ప్రొఫెసర్లు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందులో భాగంగానే ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీని అడగడం కోసం మాత్రమే వారు రోడ్లపైకి వచ్చారు. గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు కేవలం 10000 రూపాయల జీతంతో తమ జీవనభృతిని గడపడమే కాకుండా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు ప్రజల ఆరోగ్య రక్షణ పోషకారము మాతా శిశు సంరక్షణ అంటి వ్యాధులు వస్తే ప్రజలు జాగ్రత్త చెప్పడం కరోనా వంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు తమ ప్రాణాల్ని ప్రాణంగా పెట్టి సేవలందించారు. అటువంటి ఆశా వర్కర్ తమ యొక్క జీతం పెంచాలని ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని ఇన్సూరెన్స్ 50 లక్షలు పెంచాలనిఅధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అదే డిమాండ్ ను ముందు పెట్టి వారు అడుగుతున్నారు. కావున ఈ న్యాయమైన డిమాండ్ ను తీర్చవలసిందిగా ఆశా వర్కర్ల తరపున "నిరుపేదల హక్కుల సాధన సమితి "డిమాండ్ చేస్తుంది ఆశ వర్కర్ లు పగలనక రేయనక తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు గౌరవ పార్లమెంటు లోక్సభ సభ్యులు తమ శ్రమని దృష్టిలో పెట్టుకొని జీతాలు పెంచుకున్నారు సంతోషం కానీ మీలాగా మీకంటే ఎక్కువగా కష్టపడే ఆశా వర్కర్లను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని వారు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని వారి న్యాయమైన డిమాండ్లు
1 పదివేల రూపాయల నుండి 18 వేల రూపాయల వరకు జీతం పెంచాలి
2 ఈఎస్ఐ పీఎఫ్ సదుపాయం కల్పించాలి
3 ప్రతి ఆశా వర్కర్ కు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను క్రమబద్ధీకరించాలి
ఈ న్యాయమైన డిమాండ్లను నిరుపేదల హక్కుల సాధన సమితి సమర్థిస్తూ ఆశా వర్కర్ల ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వము నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం
అలాగే పౌర ప్రజాస్వామిక స్పందనగా రాజ్యాంగ హక్కుల్ని ప్రజలకు ఎరుక పరుస్తూ ప్రజలకు న్యాయాన్ని అందించాలని దృష్టితో ఈరోజు అనేక మంది న్యాయవాదులు పనిచేస్తున్నారు. అట్లాంటి న్యాయవాద వృత్తిని చేపట్టిన వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కొందరి స్వార్థపూరిత విధానాల వల్ల న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది ఇందులో భాగంగానే ఇజ్రాయిల్ అని న్యాయవాది హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అని నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ, కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి తెలిపారు