| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పశువుల సంతను నీరుగార్చే ప్రయత్నం మానుకోవాలి

పశువుల సంతను నీరుగార్చే ప్రయత్నం మానుకోవాలి

ఇప్పటికీ వరకు సంత పాటపై వచ్చిన పైసలు లేక్క తేల్చాలి

సంత నిర్వహణకు స్థలం కేటాయించాలి

పశువుల సంత వేలం పాటలో గిరిజనేతరుల ప్రమేయం లేకుండా చూడాలి?

భద్రాచలం ఐటిడిఏ పీఓ,జిల్లా పంచాయతీ అధికారి పాల్గొనాలి

ఇరప. రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:

చర్ల మండలంలో అత్యధిక ఆదాయం ఉన్న పశువుల సంతను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు ఆరోపించారు.ఇందులో భాగంగా మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.పశువుల సంత పాట సమయం రాగానే అర్హతలేని గిరిజనేతరులు అమాయకులైన ఆదివాసీలను బీనామిలుగా వాడుకోని లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు.ఇప్పటికే ఆదివాసీ చట్టాలను అతిక్రమించి భూ బదలాయింపులు,బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు.చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఆదివాసీ చట్టాలు నీరుగారుతున్నాయని మండిపడ్డారు.5 లక్షలు ఉన్న పశువుల సంత వేలం పాటను ఆదివాసీలు పాల్గొనకుండా 50 లక్షలు చేశారని అంత డబ్బు ఆదివాసీ ప్రజల దగ్గర ఎక్కడ ఉందని ప్రశ్నించారు.పశువుల సంతను నీరుగార్చే కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ఆరోపించారు.

ఐటిడిఏ పీఓ, జిల్లా పంచాయతీ అధికారి హాజరు కావాలి

దాదాపు (50 లక్షలు)అరకోటి రూపాయలు పలికే పశువుల సంత వేలం పాటలో భద్రాచలం ఐటిడిఏ పీఓ, జిల్లా పంచాయతీ అధికారి పాల్గొనాలని డిమాండ్ చేశారు.ఇక్కడి అధికారులు గిరిజనేతరులతో కుమ్మక్కై అసలైన ఆదివాసీ అన్యాయం చేస్తున్నారని అన్నారు.ఉన్నత అధికారులు పశువుల సంతలో పాల్గొన్నప్పుడే ఎవరికి లబ్ది చేకూరుతుందో తెలుస్తోందని అన్నారు....

Previous క్రీడా పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికలు
Next జర్నలిస్టులు చేస్తున్న వంట వార్పు ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీ తరపున తన సంపూర్ణ మద్దతు తెలిపిన మాజీ మంత్రి వనమా
ADVERTISEMENT