| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

డైలీ భారత్, కామారెడ్డి: టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత తొలిసారిగా నిజామాబాద్‌ జిల్లాకు వస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రవీందర్‌ గుప్తా ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు ర్యాలీగా నిజామాబాద్‌కు బయలుదేరారు. దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, కామారెడ్డి మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా నంగు నూరి రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కవిత ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నారని అన్నారు. కవితకు స్వాగతం పలికేందుకు కామారెడ్డి నుంచి భారీగా తరలివెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాములు, అడ్వకేట్‌ దేవేందర్‌ గౌడ్‌, మైనార్టీ నాయకుడు ఏసు, వెంకటరమణ, కొమ్ము రాములు, మహిళా నాయకురాలు సన తదితరులు పాల్గొన్నారు.

Previous మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Next కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
ADVERTISEMENT