డైలీ భారత్, వరంగల్: వరంగల్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడిలో ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పాలకుర్తిలో ఇరిగేషన్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న గంటి శ్రీకాంత్, హన్మకొండ భవానీనగర్‌లోని తన నివాసంలో ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి, ఎంబీ రికార్డులలో తుది కొలతలను నమోదు చేయడానికి సదరు అధికారి ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, రసాయనాలతో కూడిన లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
#acb #warangal #acb Telangana